CMని కలిసిన ఎమ్మెల్యే దంపతులు
NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ దంపతులు బుధవారం జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల మే 3వ తేదీన జరగనున్న తన కుమారుడు చిక్కుడు యశ్వంత్ వివాహానికి హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే దంపతుల ఆహ్వానాన్ని స్వీకరించిన సీఎం, వారికి శుభాకాంక్షలు తెలిపారు.