'ఫైనల్' వాగ్వాదం.. అర్ష్‌దీప్‌కి గంభీర్ మద్దతు

'ఫైనల్' వాగ్వాదం.. అర్ష్‌దీప్‌కి గంభీర్ మద్దతు

T20 WC ఫైనల్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ డెరిల్ మిచెల్‌తో అర్ష్‌దీప్ సింగ్ వాగ్వాదాన్ని కోచ్ గంభీర్ సమర్థించాడు. మ్యాచ్ తర్వాత అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పాడు కానీ అలా చేయకపోయినా పర్లేదని.. తన ప్లేయర్లను అగ్రెసివ్‌గానే చూడాలని భావిస్తున్నట్లు గౌతీ తెలిపాడు. మైదానంలో స్నేహితులు, శత్రువులు ఉండరని.. దేశం తరఫున మ్యాచ్ గెలవడమే ఆటగాళ్ల లక్ష్యమని పేర్కొన్నాడు.