తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

BPT: కారంచేడులోని మాదిగ కుంట యానాది కాలనీకి చెందిన నాగేంద్రం అనే బాలిక తప్పిపోయిందని గురువారం ఆమె పెంపుడు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఖాదర్ భాషా ఆధ్వర్యంలో ఇంకొల్లు, చిన్నగంజాం ఎస్సైల సహకారంతో బృందాలుగా ఏర్పడి కోటప్పకొండ క్రాస్ రోడ్డు వద్ద బాలికను గుర్తించారు. అనంతరం బాలికను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.