VIDEO: గాలి బీభత్సం.. విరిగిన విద్యుత్ స్తంభాలు..!

VIDEO: గాలి బీభత్సం.. విరిగిన విద్యుత్ స్తంభాలు..!

GDWL: గట్టు మండలం మల్లంపల్లి, కొత్తపల్లి గ్రామాల మధ్య మంగళవారం వీచిన గాలివాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన గాలుల ధాటికి దాదాపు ఆరు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పాటు ఒక భారీ వేప వృక్షం కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. మండలంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ భారీ వృక్షాలు కూలి విద్యుత్ తీగలు తెగిపోయినట్లు సమాచారం.