మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

ATP: గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్‌లో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్‌ను తొలగించాలని కోరుతూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తే ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని పేర్కొన్నారు. వెంటనే సెల్ టవర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.