కుల బహిష్కరణలను అరికట్టాలి: రాజేశ్వరి
ATP: జిల్లాలో జరుగుతున్న కుల బహిష్కరణలను అరికట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరి డిమాండ్ చేశారు. కుల బహిష్కరణలు చేస్తూ బాధితులను వేధిస్తున్నకుల పెద్దలపై కేసులు నమోదు చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బేడ బుడగ జంగాల కుల పెద్దల అరాచకాలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు.