ఈ వారంలో ఆకస్మిక తనిఖీలు: కలెక్టర్

ఈ వారంలో ఆకస్మిక తనిఖీలు: కలెక్టర్

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ వారంలో పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని, సంక్షేమ పథకాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.