విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
NRPT: మక్తల్ మండలంలో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులలో బోధన సామర్ధ్యాన్ని పరిశీలించారు. పదో తరగతిలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు రావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.