రాష్ట్రపతి ముర్ముతో ఎంపీ అంబికా
ATP: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై తోటి పార్లమెంట్ సభ్యులతో అభిప్రాయాలను పంచుకున్నారు.