ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

కృష్ణా: నందమూరు గ్రామంలోని కోటవానిపాలెంలో ఇవాళ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికతీతలను పంచాయతీ కార్మికులతో తీయించి, సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించారు. అనంతరం దుర్వాసనలు క్రిమికీటకాలు నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లారు.