రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి లక్ష్మి (35) మృతి చెందింది. భర్త చందు, కుమారుడు తణయ్‌లతో కలిసి రామంతపూర్ వద్ద ఉన్న పాఠశాలలో ఫీజు కట్టెందుకు వెళ్లారు. ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చందు, తణయ్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి.