కరెంట్ షాక్‌తో గేదె మృతి
KMR: ఇస్రోజీవాడిలో విద్యుత్ సరఫరా వైఫల్యం కారణంగా ఓ పశువు మృతిచెందింది. ఆదివారం మేత మేస్తుండగా పశువు కరెంట్ షాక్‌కు గురైంది. గమనించిన యజమాని శ్యామరావు కట్టెతో విద్యుత్ తీగను తొలగించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. నెల రోజుల్లో దూడకు జన్మనివ్వాల్సిన పశువు చనిపోవడంతో శ్యామరావు కుటుంబం కన్నీరుమున్నీరైంది.