నూతన ఉత్పత్తులపై దృష్టి సారించాలి: కలెక్టర్
NLG: మహిళా సంఘాల సభ్యులు నూతన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి ఆర్థికంగా మరింత ముందుకు ఎదగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ జిల్లా నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవ్‌కు వెళుతున్న స్వయం సహాయక మహిళా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల ప్రత్యేక బస్సుకు ఆమె కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.