సంఘీభావ ర్యాలీకి బీఆర్ఎస్ మద్దతు

సంఘీభావ ర్యాలీకి బీఆర్ఎస్ మద్దతు

KMM: ఆమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులను నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈనెల 7న ఖమ్మంలో జరిగే సంఘీభావ ర్యాలీకి BRS పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తెలిపారు. ఇవాళ ఖమ్మం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.