'మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి సారించాలి'

ప్రకాశం: గిరిజన ఆవాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను త్వరగా కల్పించడంపై మరింత దృష్టి సారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. పీ.ఎం – జన్ మన్, డీ.ఏ – జె.జి.యు.ఏ. పథకాలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.