సెమీస్‌కు చేరిన జిల్లా బాలికల క్రికెట్ టీమ్
E.G: జిల్లాలో రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్ పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఏ, బి, సీ, డీ పూల్స్‌గా విభజించి లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. తొలిరోజు తూర్పుగోదావరి, అనంతపురం జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ప్రతి పూల్ నుంచి రెండు స్థానాలు సాధించాల్సి ఉండగా.. కర్నూలు, ప్రకాశం జట్లు ఓటమి కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించాయి.