లారీ, బైక్ ఢీ.. బాలుడు మృతి
కృష్టా: పామర్రు- గుడివాడ NHపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు(మైనర్), జగదీశ్(14) బైక్‌పై వెళ్తుంగా.. గుడివాడ వైపు నుంచి వస్తున్న లారీ వారి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.