వామ పక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ

వామ పక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ

ELR: జంగారెడ్డిగూడెంలో బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కార్పొరేట్ల సంస్థలకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.