VIDEO: మహాదేవపూర్‌లో.. 26 బండ్లు సీజ్
భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ యువతను మత్తు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహదేవపూర్‌లో నాకబంది నిర్వహించి, పలు కాలనీలలో ఇంటింటా సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వెంకటేశ్వర్లు, ఎస్సైలు, 80 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు.