'ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి'

PDPL: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు సమస్యలపై దరఖాస్తులు ఎక్కువగా అందాయన్నారు. దరఖాస్తులను పెండింగులో పెట్టవద్దని అధికారులకు సూచించారు.