పట్టుబడ్డ ఆరుగురు కోడి పందెం రాయుళ్లు

పట్టుబడ్డ ఆరుగురు కోడి పందెం రాయుళ్లు

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం వద్ద కోళ్ల పందెం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈగల్ టీం సీఐ సుధాకర్రావు ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్సై మహబూబ్ బాషా, సిబ్బంది కలిసి ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.