VIDEO: శ్మశాన వాటికకు రోడ్డు పనులు ప్రారంభం

CTR: పుంగనూరు పట్టణం కోనేటి పాళ్యం సమీపంలో బ్రాహ్మణుల స్మశాన వాటికకు మంగళవారం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. శ్మశాన వాటికకు సరైన దారి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలను బ్రాహ్మణ సంఘం వారు అందజేశారు. ఎట్టకేలకు స్పందించి పురపాలక అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు.