కంభంలో విజిబుల్ పోలీసింగ్
ప్రకాశం: కంభం పట్టణంలో ఎస్సై నరసింహరావు ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ గురువారం రాత్రి నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలను ఎస్సై పర్యవేక్షించారు. ప్రజల్లో భద్రతాభావం కలిగించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.