బైక్-లారీ ఢీ.. ఇద్దరికి గాయాలు

బైక్-లారీ ఢీ.. ఇద్దరికి గాయాలు

NZB: చందూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం లారీ-బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. వర్ని నుంచి చందూర్ వైపు వెళ్తున్న బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కింద పడ్డారు. వారిలో ఒకరి తలకు తీవ్ర గాయం కాగా మరొకరికి స్వల్ప గాయలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.