GHMCలో విలీనం.. అధికారులు తర్జన భర్జనలు
HYD: శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. డిప్యూటేషన్‌పై హెచ్ఎండీఏకు వెళ్లిన పలువురు అధికారులు తిరిగి జీహెచ్ఎంసీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడేందుకే వారు ఇలా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.