'గద్వాలలో పైపుడ్ గ్యాస్ (PNG) సరఫరాకు కసరత్తు'
GDWL: భవిష్యత్తులో గ్యాస్ కొరతను అధిగమించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాలో పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరాకు కలెక్టర్ రిజ్వాన్ బాషా శ్రీకారం చుట్టారు. తొలుత కమర్షియల్ అవసరాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.