RU, CU వసతి గృహాలలో వసతుల కొరత

RU, CU వసతి గృహాలలో వసతుల కొరత

కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ వర్సిటీ, క్లస్టర్‌ వర్సిటీ వసతి గృహాలలో అధికారులు నిర్వహణను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెస్‌ బిల్లు చెల్లిస్తున్నా కూడా మెనూ ప్రకారం భోజనం వడ్డించట్లేరని వాపోతున్నారు. నాసిరకం సరకులు వాడుతున్నారని, వంట గదులు పరిశుభ్రంగా లేవని, కనీస సౌకర్యాలు లేక దుర్భరంగా ఉన్నాయని పేర్కొన్నారు.