రోడ్డు ప్రమాదం.. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
TG: మీర్జాగూడ ప్రమాదంపై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'RTC బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో పలువురు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.