బాపట్ల ఎస్పీ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే
BPT: పోలీస్ కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్‌ను త్వరతగతిన అందజేసేలా చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణ, సాధారణం, అనారోగ్యం, ప్రమాదంలో మృతి చెందిన బాధిత పోలీసు కుటుంబాలతో పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు.