HYD మెట్రో.. స్వయంగా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
హైదరాబాద్ మెట్రో స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేస్తోంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు స్వయంగా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఉప్పల్ డిపోలో ఖాళీ స్థలంలో సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మియాపూర్ డిపో, మెట్రో స్టేషన్ ప్రాంగణాల్లో కూడా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మొత్తం 12.41MW విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.