నేడు స్కూల్స్‌కు సెలవు

SKLM: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం రాత్రి అధికారకంగా వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనలతో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.