కరేడులో ఒకరిపై గృహహింస కేసు

కరేడులో ఒకరిపై గృహహింస కేసు

NLR: ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన పుష్పలత ఫిర్యాదు మేరకు ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డిపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంకమ్మ శుక్రవారం తెలిపారు. రెండేళ్ల క్రితం వివాహం జరిగిన పుష్పలత, తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది.