VIDEO: పోలీసు వ్యవస్థపై మండిపడ్డ దర్శి ఎమ్మెల్యే

ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సోమవారం పోలీసు వ్యవస్థపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పిన విధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందన్నారు. వారు చెప్పిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ హద్దుల్లో ఉండాలన్నారు.