టీ చేస్తూ ఎన్నికల ప్రచారం

టీ చేస్తూ ఎన్నికల ప్రచారం

చిత్తూరు: నగరాన్ని స్మార్ట్ సిటీ చేయడమే లక్ష్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్‌మోహన్ శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని చర్చి వీధిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీ షాప్‌లో టీ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.