రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత పరిస్థితులు

NDL: కొలిమిగుండ్ల మండలం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కలవటాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కృష్ణా రంగారెడ్డి అనుచరులతో కలిసి సిమెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు. రాంకో సిమెంట్ పరిశ్రమ సిబ్బందికి టీడీపీ నాయకులకు మధ్యన ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు.