రూ.4 కోట్లతో 36 పనులకు ప్రతిపాదనలు
AKP: కోటవురట్ల మండలంలో 36 ఇరిగేషన్ పనులకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఇరిగేషన్ ఏఈ రాజేష్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం మండల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏవో సరోజిని మాట్లాడుతూ.. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుని 11 అంకెల గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. ఈ ఏడాది 2,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని పేర్కొన్నారు.