ఓట్ చోరీ జరగకుండా ఉండాలని సంతకాల సేకరణ

ఓట్ చోరీ జరగకుండా ఉండాలని సంతకాల సేకరణ

VZM: దేశ ప్రజల ఓటు హక్కు కాపాడటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మరిపి విద్యాసాగర్ తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 15 వరకు కాంగ్రెస్ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పలు డిమాండ్లతో కూడిన కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.