VIDEO: గుంటూరులో 9న AIKMS రాష్ట్ర సదస్సు
GNTR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 9న రాష్ట్రసదస్సు నిర్వహిస్తున్నట్లు AIKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు తెలిపారు. అరండల్ పేటలో మంగళవారం సదస్సు పోస్టర్లను AIKMS నాయకులు ఆవిష్కరించారు. అరండల్ పేటలోని ఆర్యసమాజ్ భవనంలో మాదాల నారాయణ స్వామి వర్థంతి సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు.