పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
VZM: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16 నుంచి వచ్చే నెల 1వ తేది వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ముందుగా విద్యార్థులు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా రాయాలని హితవు పలికారు.