భారత దౌత్యవేత్తకు పాక్‌ సమన్లు

భారత దౌత్యవేత్తకు పాక్‌ సమన్లు

పాకిస్తాన్ భారతీయ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పాక్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆ అధికారిని ఆదేశించింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది.