సలేశ్వరం జాతరకు స్పెషల్ బస్సులు
NGKL: నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం యాత్ర సందర్భంగా నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం రూట్ సర్వే నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.