VIDEO: కాలుజారి గెడ్డలో పడి కొట్టుకుపోయిన బాలిక
VSP: పద్మనాభం(M) తునిపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు గెడ్డలో జారిపడి ఓ బాలిక గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. కాళ్ల ధనుశ్రీ (13) తల్లి గౌరి, తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతికెందుకు గెడ్డకు వెళ్లింది. ఆ సమయంలో పొరపాటున కాలుజారి గెడ్డలోకి కొట్టుకుపోయిందని తల్లి గౌరి తెలిపారు. దీంతో ధనుశ్రీ ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులు గెడ్డలో గాలిస్తున్నారు.