కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన MLA
ADB: తలమడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెక్కుల జారీలో అధికారులు ఆలస్యం చేయొద్దని సూచించారు.