విజిబుల్ పోలీసింగ్‌తో భద్రత కట్టుదిట్టం

విజిబుల్ పోలీసింగ్‌తో భద్రత కట్టుదిట్టం

కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత కోసం విజిబుల్ పోలీసింగ్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ బలోపేతం చేశారు. వాహనాల తనిఖీలతో గంజాయి అక్రమ రవాణాపై కట్టడి చేస్తున్నారు. సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మైనర్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం హెచ్చరించారు. సమస్యలపై 112, 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.