అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
PLD: నరసరావుపేటలోని అన్నా క్యాంటీన్‌ను కలెక్టర్ కృత్తికా శుక్ల బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంటీన్ సమయపాలన, ఆహార పదార్థాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ ఏరియా, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించి, మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.