శ్రీరామనవమి.. ముస్తాబైన ఆలయాలు

శ్రీరామనవమి.. ముస్తాబైన ఆలయాలు

కృష్ణా: శ్రీరామనవమి పండగ సందర్భంగా జిల్లాలోని రామాలయాలు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత వైభవంగా ముస్తాబయ్యాయి. ఈ మహాత్తర కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఆలయాలు సర్వాంగసుందరంగా దర్శనమిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం పలు ఆలయాల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు. కాగా, ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.