తదుపరి సుప్రీం లీడర్ ఎవరు..?
ఖమేనీ మృతి చెందడంతో తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పదవికి ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో మోజ్తబా, హసన్ ఖమేనీ ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హసన్ ఖమేనీ ఇరాన్ వ్యవస్థాపకుడు ఆయతుల్లా ఖమేనీ మనవడు. ఈయనకు మతపరమైన సంస్థల్లో, సంప్రదాయవాదుల్లో గుర్తింపు ఉంది. అలాగే మోజ్తబాకు ఇరాన్ రాజకీయాల్లో, నిఘా వర్గాల్లో పట్టు ఉంది.