స్నేహితుడి కుటుంబానికి చేయూత

KMR: బిబిపేట మండల కేంద్రానికి చెందిన సాయి మృతి చెందడంతో అతనితో చదువుకున్న మిత్రులు చేయూతగా నిలిచారు. 2001-02 ఎస్ఎస్సీ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు బుధవారం ఆర్థిక సహయం అందజేశారు. 50 కిలోల బియ్యం ఆయన భార్యకు అందజేశారు. తమతో పాటు చదువుకున్న స్నేహితుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేశామన్నారు.