ఈదురు గాలులతో వర్షం.. నిలిచిపోయిన విద్యుత్

NLR: ఆత్మకూరు మండల పరిధిలో ఆదివారం ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షంతోపాటు భారీ ఈదురు గాలులు వేస్తూ ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు పాలెం సబ్‌స్టేషన్ పరిధిలోని కరటంపాడు, డిసిపల్లి, నందవరం, తదితర ప్రాంతాలలో గాలులు వీస్తూ ఉండడంతో ముందస్తు చర్యలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.