గుర్తుతెలియని శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
NRPT: మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలోని పాడుబడ్డ బావి పక్కన చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో శుక్రవారం గ్రామస్థులు గమనించగా, అప్పటికే కుక్కలు పీక్కు తినడంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. దీనిపై గ్రామస్థులు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.